రెంజల్, డిసెంబరు 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని నీలా గ్రామ శివారు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను డోజర్ను పట్టుకొని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ సిఐ శ్రీధర్తో కలిసి నీలా గ్రామ శివారులో రెండు ఇసుక టిప్పర్లతో పాటు ఒక డోజర్ను స్వాధీనం చేసుకొని డ్రైవర్ ఓనర్లపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మండలంలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సాయన్న హెచ్చరించారు.