రెంజల్, డిసెంబరు 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని నీల గ్రామానికి చెందిన హిందూ యూత్ సభ్యులకు ఆదివారం క్రీడా పరికరాలను వైస్ ఎంపీపీ యోగేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు విద్యతోపాటు అటాల్లో మెలుకువలు నేర్చుకొని ముందుకుసాగాలని పిలుపునిచ్చారు.
క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్య నైపుణ్యాలు ఆటల్లో మెలకువలు పాటించి ముందుకు సాగాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ బోధన్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ శ్రీధర్, యూత్ సభ్యులు సతీష్, శ్రీకాంత్, లక్ష్మణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.