విద్యార్థుల సమస్యలు కేసీఆర్‌ ప్రభుత్వానికి పట్టవా?

కామారెడ్డి, డిసెంబరు 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కెసిఆర్‌ ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్‌సిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రెండేండ్లుగా చెల్లించని రూ.3 వేల 100 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ పిడిఎస్‌యు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చలో కామారెడ్డి కలెక్టరేట్‌ నిర్వహించారు. ముందుగా కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన నిర్వహించి, విద్యార్థులు కలెక్టరేట్‌ గేట్‌ ముందు ధర్నా నిర్వహించారు.

పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షుడు జి సురేష్‌ మాట్లాడుతూ స్కాలర్‌ షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తున్న 15 లక్షల మంది విద్యార్థుల చదువుల పట్ల కనికరం చూపని కేసిఆర్‌ ఉదాసీన వైఖరి విడనాడాలన్నారు. మరోవైపు డబ్బులు కట్టకపోవడంతో కాలేజీ మేనేజ్‌మెంట్లు సర్టిఫికెట్లు ఇవ్వక విద్యార్థులు ఉన్నత చదువులకు ఇబ్బందుల దృష్ట్యా కొందరు తల్లిదండ్రులు అప్పు తెచ్చి కాలేజీ ఫీజులు కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెచ్చిన అప్పులకు రోజు రోజుకు వడ్డీ పెరిగిపోతోందని, ఇంకొంత మంది ఫీజులు చెల్లించలేక, సర్టిఫికెట్లు కాలేజీలోనే వదిలేసి పైచదువులు ఆపేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థులకు సర్కార్‌ వెంటనే స్కాలర్‌ షిప్‌, ఫీజు రీయింబర్స్మెంట్‌ బకాయిలు విడుదల చేయకుండా సీఎం కేసీఆర్‌ విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్‌ విడుదల కాక చాలా మంది విద్యార్థులు పార్ట్‌ టైం జాబ్‌ చేసి కాలేజీ ఫీజులు కట్టుతున్న దౌర్భాగ్యం బంగారు తెలంగాణాలో నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండేండ్లుగా ఫీజులు చెల్లించకపోవడం, విద్యా వ్యవస్థపై సర్కార్‌ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. ఫీజులు కట్టలేక కొంత మంది స్టూడెంట్లు మధ్యలోనే చదువులు మానేస్తున్నరని వెంటనే బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. పెరిగిన ధరల దృష్ట్యా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందలేక ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్‌ కాస్మోటిక్‌ చార్జీలు పెంచమని విద్యార్థులు కోరుతున్న కేసీఆర్‌ సర్కార్‌ పెడచెవిన పెడుతుందన్నారు. మెస్‌ కాస్మోటిక్‌ చార్జిలు పెంచాల్సిన ప్రభుత్వం కనీసం విద్యార్థులకు ఇవ్వాల్సిన మెస్‌, కాస్మోటిక్‌ చార్జీల బకాయిలను కూడా విడుదల చేయని దుర్మార్గ పాలన కొనసాగిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పి.డి.ఎస్‌.యు జిల్లా ఉపాధ్యక్షులు సరిచందు, జిల్లా సహాయ కార్యదర్శులు కృష్ణ, అరవింద్‌, జిల్లా నాయకులు సచిన్‌, నవీన్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »