బోధన్, డిసెంబరు 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో మంగళవారం న్యాయవాదుల సమావేశం నిర్వహించారు. ఇందులో బోధన్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకునేందుకు అన్ని సదుపాయాలు ఉన్నాయని, కావున ప్రభుత్వం స్పందించి బోదన్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని వారు తీర్మానించారు.
ఇందుకోసం ఈనెల 19వ తేదీ నుండి పలు దఫాలుగా ఉద్యమాలు చేస్తామని బోధన్ న్యాయవాదులు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బోధన్‌ను జిల్లా కేంద్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. బోధన్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకునేందుకు కావాల్సిన వనరులన్ని ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే పరిపాలనా సౌలభ్యం కోసం పాలన వికేంద్రీకరణ ద్వారా నూతన జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేస్తుంది కావున అదేవిధంగా బోధన్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం బోధన్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు ఈనెల 19 నుండి పలు దఫాలుగా నిరసనలు తెలుపుతూ ఉద్యమిస్తామన్నారు. ఉద్యమానికి బోధన్ ప్రాంత ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అధ్యక్షుడు గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, కోశాధికారి శంకర్, సంయుక్త కార్యదర్శి మహమ్మద్ వాజిద్ హుస్సేన్, సాంస్కృతిక క్రీడా కార్యదర్శి అజయ్‌కుమార్, సీనియర్ న్యాయవాదులు అర్జున్, నరేశ్ కులకర్ణి, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.