కామారెడ్డి, డిసెంబరు 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 15 తారీకు నుండి 22వ తారీకు వరకు కర్ణాటకలోని బెల్గాంలో జరిగే ట్రాకింగ్ క్యాంప్‌కు స్థానిక చిన్న మల్లారెడ్డి గ్రామంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ఎన్సిసి అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
వీరు 15వ తారీకు నుండి 22వ తారీకు వరకు కర్ణాటకలోని బెల్గామ్‌లో జరిగే ఎన్సిసి శిక్షణ శిబిరంలో 8 రోజులపాటు పాల్గొంటారని తెలిపారు. వీరితోపాటు నిజామాబాద్ జిల్లా గిరిరాజ్ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్థులు కూడా శిక్షణ శిబిరంలో పాల్గొంటారన్నారు. శిక్షణ శిబిరానికి కామారెడ్డి జిల్లా నుండి చిన్న మల్లారెడ్డి ఉన్నత పాఠశాల చెందిన విద్యార్థులు మాత్రమే పాల్గొనడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం సంతోషం వ్యక్తం చేశారు.