కమ్మర్పల్లి, డిసెంబరు 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని అమీర్ నగర్ గ్రామంలో శ్రీ కృష్ణా యాదవ సంఘం ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుండి కొనసాగుతున్న సంత మల్లన్న జాతరలో భాగంగా మంగళ వారం చివరి రోజు గ్రామంలోని మహిళలు పెద్దఎత్తున బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు.
గ్రామంలో నుండి ప్రతి ఏటా బోనాలు తీయడం ఆనవాయితీ, అదే కొనసాగింపుగా గ్రామంలో నుండి గ్రామ శివారులో గల సంత మల్లన్న గుడి వద్దకు ఊరేగింపుగా డీజె చప్పుడు నృత్యాలు చేస్తూ ఎంతో సంబరంగా గ్రామ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. గుడి వద్దకు చేరుకున్న భక్తజనం అక్కడే నాగవెల్లి, నైవేద్యం, అగ్నిగుండం కార్యక్రమంలో పాల్గొని వైభవంగా జాతర ఉత్సవాలను ముగించారు.
ఈ సందర్భంగా యాదవ సంఘ సభ్యులు మాట్లాడుతూ తమ గ్రామంలో ప్రతి ఏటా యాదవ సంఘాల ఆధ్వర్యంలో శ్రీ సంత మల్లన్న జాతర నిర్వహించడం మేము ఎంతో అదృష్టంగా బావిస్తున్నామన్నారు. గ్రామంలోని ప్రజలందరూ కలిసి మెలిసి, పాడి పంటలతో, సుఖశాంతులతో ఉండాలని మల్లన్న దేవుడిని వేడుకున్నట్టు తెలిపారు.
కార్యక్రమాలలో శ్రీ కృష్ణ యాదవ సంఘం పెద్దమనుషుల, సభ్యులు యాదవ కులస్తులు, గ్రామంలోని అన్ని కులాల, రైతులు, యువకులు, మహిళలు భారీగాగా పాల్గొని మల్లన్న జాతరను విజయవంతం చేశారు.