కామారెడ్డి, డిసెంబరు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రూ.55 కోట్ల రుణాలు స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘాలకు పంపిణీ చేసినట్లు అదనపు డిఆర్డిఓ మురళీకృష్ణ అన్నారు. కామారెడ్డి మండల సమాఖ్యలో బుధవారం జిల్లా స్థాయి వాటాదారుల సమావేశానికి హాజరై మాట్లాడారు.
జిల్లాలో స్త్రీ నిధి ద్వారా రూ.154 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2022-23 సంవత్సరంకు వార్షిక ప్రణాళిక, మండలాల వారిగా సాధించిన ప్రగతి వివరాలు చెప్పారు.
పెండిరగ్ బకాయిలను వసూలు చేసే విధానం గురించి తెలిపారు. ఎస్‌హెచ్‌జిల ద్వారా నేరుగా స్త్రీనిధి రుణాలు తిరిగి చెల్లింపులు ఫోన్ పే, గూగుల్ పే, భీమ్ యాప్ ద్వారా చేసుకోవచ్చని సూచించారు. ప్రత్యేక జీవనోపాదులపై చర్చించారు. సమావేశంలో జెడ్ ఎమ్ రవికుమార్, స్త్రీ నిధి ఆర్‌ఎం శ్రీనివాస్, డిపిఎంలు సుధాకర్, రమేష్ బాబు, ఏపీఎం శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.