నిజామాబాద్, డిసెంబరు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంటి వెలుగు కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ పద్దతిలో డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేయటానికి 70 మంది కావాలని, వీరు ఏదేని డిగ్రీ అర్హత కలిగి, కంప్యూటర్ కోర్సులో డిసిఎ / పిజిడిసిఎ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హులైన అభ్యర్థులు సంబంధిత దృవీకరణ పత్రాలు (విద్యార్హత, కుల, బోనోఫైడ్‌తోపాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలు) జిరాక్సు సెట్‌తో ఈనెల 15వ తేదీ ఉదయం 10.30 గంటల నుండి 3 గంటల వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖా కార్యాలయం నిజామాబాద్‌లో (రెండవ అంతస్తు రూం నెంబరు 201) లో హాజరు కావాలన్నారు.