ఎడపల్లి, డిసెంబరు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బతుకు దెరువు కోసం దేశాన్ని విడిచి గల్ఫ్‌లోని ఖతర్‌కు వెళ్లిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్న ఘటన ఎడపల్లి మండలంలోని కుర్నపల్లి గ్రామంలో చోటు చేసుకొంది. స్థానికుల వివరాలిలా ఉన్నాయి…
గ్రామానికి చెందిన వామనచారి (44) అనే వ్యక్తి ఉపాధి కోసం గల్ఫ్‌లోని ఖతర్ వెళ్ళాడని ఈ క్రమంలో తాను నివసిస్తున్న గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి బుధవారం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. బ్రతుకుతెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లిన వామన చారి 6 నెలల క్రితం ఇంటికి తిరిగివచ్చాడు. గత మూడు నెలల క్రితం తిరిగి ఖతార్ దేశానికి వెళ్ళాడు. వామనాచారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతుడికి ఇద్దరు పిల్లలు భార్య ఉన్నారు.