ఆర్మూర్, డిసెంబరు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాత్రి పదకొండు గంటల సమయం …. ఆర్మూర్ పట్టణము గాఢ నిద్రలో వున్న సమయములో … ఆర్మూర్ పట్టణములోని కొత్త బస్టాండ్ సమీపములో రెండు కార్లు వచ్చి ఆగాయి …. కార్లలోనుంచి దాదాపు ఎనిమిది మంది తమ చేతుల్లో దుప్పట్లు పట్టుకుని దిగి అటూఇటూ చూసారు రోడ్డు పక్క ఏ దిక్కు లేని అభాగ్యులు, యాచకులు, వృద్దులు కొందరు చలి పులికి తట్టుకోలేక గజ గజా వణుకుతున్నారు, వారి వద్దకు వెళ్లి వారికీ వెచ్చగా దుప్పట్లు కప్పారు. ఎవరు వచ్చి తమకు దుప్పట్లు కప్పి ఆదుకున్నారో తెలియని ఆ అభాగ్యులు వారిని చెమర్చిన కళ్ళతో కృత్ఞతలు తెలిపారు.
రక్షా స్వచ్చంద సేవా సంస్థ ఆర్మూర్ ఆధ్వర్యములో సంస్థ అధ్యక్షులు ఖాందేష్ శ్రీనివాస్ అధ్యక్షతన ప్రతి సంవత్సరం చలికాలంలో లాగా ఈ సంవత్సరం కూడా బుధవారం రాత్రి ఆర్మూర్ పెర్కిట్ మామిడిపల్లి ప్రాంతాల్లో చలి పులికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న రోడ్డు పక్క అభాగ్యులకు, వృద్దులకు, అతి నిరుపేదలకు దుప్పట్ల పంపిణి చేశారు.
ఈ సందర్బంగా సంస్థ అధ్యక్షులు ఖాందేష్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ చలికాలములో రోడ్డు పక్క అభాగ్యులకు నిరుపేదలకు దుప్పట్లు పంపిణి చేసినట్లు తెలిపారు. కార్యక్రమానికి ప్రాజెక్ట్ చైర్మన్‌గా ప్రవీణ్ పవార్ వ్యవహరించారు. కార్యక్రమములో స్వచ్చంధ సేవా సంస్థ ఉపాధ్యక్షులు జిందమ్ నరహరి, విద్యా గోపి కృష్ణ, కోశాధికారి గోనె శ్రీధర్, కార్యనిర్వాహక కార్యదర్శులు బేతు గంగాధర్, తులసి పట్వారి, సంయుక్త కార్యదర్శులు మీరా శ్రావణ్, సభ్యులు ఖాందేష్ గంగాధర్, విశ్వనాధ్ రాజేష్ శ్రీను, సాయి తదితరులు పాల్గొన్నారు.