ఆర్మూర్, డిసెంబరు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలానికి చెందిన బేగరి పెద్ద రాజన్న కుమారుడు బేగరి రాజు (32) గురువారం రాత్రి 10:30 నిమిషాలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం… మాక్లూర్ మండలం గుత్ప గ్రామం నుండి ఆలూర్ వైపు వస్తుండగా మార్గమధ్యలో ఉన్న వాగు వంతెన రాయికి అదుపు తప్పి ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడికి భార్య శ్రీలత, కూతురు పునర్విక (4), కొడుకు డిరపుల్ (2) తల్లిదండ్రులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.