కామారెడ్డి, డిసెంబరు 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 19 నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం కామారెడ్డి పట్టణంలో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం సర్వే చేసే అంశాలపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారులు వాస్తవాలు తెలపాలని సూచించారు. తప్పుడు సమాచారం ఇస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కామారెడ్డి పట్టణంలో 5 వేల 129 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. లబ్ధిదారుల వివరాలు సక్రమంగా నమోదు చేయాలని పేర్కొన్నారు. సర్వే పూర్తయిన తర్వాత అభ్యంతరాలు ఉంటే లబ్ధిదారులు తెలియజేయవచ్చని సూచించారు.
దివ్యాంగులు ఉంటే వారి సదరం నెంబర్ సర్వే పత్రంలో నమోదు చేయాలని చెప్పారు. ఒక సర్వే బృందం ప్రతిరోజు 10 మంది లబ్ధిదారుల వివరాలు సేకరించాలని చెప్పారు. లబ్ధిదారులు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం నెంబర్, కరెంట్ మీటర్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, రేషన్ షాప్ నెంబర్ వివరాలు అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ ప్రేమ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.