బోధన్, డిసెంబరు 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణంలోని రాకాసిపేట అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప ఆరట్టు మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప ఆరట్టు మహోత్సవానికి బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి పాల్గొని అయ్యప్ప మాలదారులు ఏర్పాటుచేసిన ఆరట్టు ఊరేగింపు ఉత్సవాన్ని ప్రారంభించారు.
ఆరట్టు ఊరేగింపు పట్టణంలోని రాకాసిపేట్ పలువీదుల గుండా కొనసాగి పసుపు వాగు వద్దకు చేరుతుంది. పట్టణ శివారులోని పసుపు వాగును పవిత్ర పంపానదిగా భావిస్తూ అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని అభిషేకించారు. అనంతరం అయ్యప్ప ఆలయం వద్దకు తీసుకువచ్చారు. ఆలయంలో అయ్యప్ప స్వామి భక్తులు విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.

ఆరట్టు ఊరేగింపులో వినాయకుడు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆరట్టు మహోత్సవం సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ తమ పద్మ శరత్ రెడ్డి తో పాటు పలువురు దాతలు అయ్యప్ప మారధారణ భక్తులకు భిక్ష ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బోధన్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు పళ్లెం పాటి శివన్నారాయణ, కార్యదర్శి చక్రవర్తి, కోశాధికారి శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్ గంగారెడ్డి, అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు.