నందిపేట్, డిసెంబరు 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాలికి పోయే కంప ఒంటికి తగిలించుకున్నట్లు చెప్పే సామెత ప్రకారం నందిపేట్ మండలంలోని తల్వేద గ్రామంలో ఓ సంఘటన వ్యక్తి ప్రాణం తీసింది. నందిపేట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సల్ల శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన మండ్ల కొండయ్య (42), మేస్త్రి పని చేసి వచ్చి గురువారం రాత్రి 8:30 గంటలకు తల్వేద గ్రామంలోని గీత మందిరం ముందు కూర్చొని వుండగా అదే గ్రామానికి చెందిన బట్టు నరేశ్ (20) అను వ్యక్తి తాగిన మైకంలో వేరే వ్యక్తితో ఫోన్ మాట్లాడుతుండగా ఫోన్ మాటల మధ్యనే గొడవ జరిగింది.
అక్కడే కూర్చుని ఉన్న మండ్ల కొండయ్య జోక్యం చేసుకొని నన్నే తిడుతున్నవా? అని నరేష్‌ను అడగగా ఫోన్ గొడవ ఇటు మరిలింది. బట్టు నరేష్ కొండయ్యను కొడుతూ నెట్టి వేయగా కొండయ్య క్రింద పడడంతో తల వెనుక భాగంలో రక్త గాయం అయింది. అదేవిధంగా కొండయ్య మెడపైన కాలితో త్రొక్కినాడు. గ్రామస్తులు హుటాహుటిన కొండయ్యను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికి కొండయ్య ప్రాణం కాపాడలేకపోయారు. బట్టు నరేష్ పై కేసు నమోదు చేసుకొని చర్య తీసుకోవాలని మృతుడి తమ్ముడు మాండ్ల మల్లికార్జున్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.