కామారెడ్డి, డిసెంబరు 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్సిసి ఏర్పాటై 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నాల్ కే.ఎస్. బద్వార్ బృందంతో కలిసి యూనిటీ ఫ్లేమ్ రన్ పేరిట యువతలో సమైక్యత స్ఫూర్తిని నింపేందుకు కన్యాకుమారి నుంచి ఢల్లీి వరకు పరుగు చేపట్టారు.
శనివారం పరుగును జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. బిక్నూర్ నుంచి అంతంపల్లి వరకు రన్ నిర్వహించారు. ఎన్సిసి విద్యార్థులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ అన్యోన్య, జిల్లా శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.