కామారెడ్డి, డిసెంబరు 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం టేక్రియాల్ గ్రామానికి చెందిన సుంకరి సావిత్రి బాల్ సాయిల కుమార్తె శృతి వివాహానికి కావలసిన పుస్తే, మెట్టలను శనివారం ఐవీఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్ అనిత గుప్తా, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు భాస్కర్ గుప్తా అందజేశారు.
ఈ సందర్భంగా ఐ.వి.ఎఫ్ నాయకులు మాట్లాడుతూ ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో అన్ని కులాల వారికి ఇప్పటివరకు 5 వేలకు పైగా కుటుంబాలకు పుస్తె, మట్టేలు అందజేశారన్నారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పేద ఆర్యవైశ్య విద్యార్థులకు విద్యాపరంగా కావాల్సిన ఆర్థిక సహాయాన్ని, అదేవిధంగా హైదరాబాదులో చదువుకుంటున్న పేద వైశ్య విద్యార్థిని విద్యార్థులకు కావలసిన హాస్టల్ సదుపాయాన్ని కూడా ఉప్పల పౌండేషన్ సహకారంతో అందజేస్తామన్నారు. ఆర్యవైశ్య విద్యార్థుల్లో ఎవరైనా సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్రిలిమ్స్‌లో అర్హత సాధించి మెయిన్స్ పరీక్షకు పోటీపడుతున్న విద్యార్థులకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం ఉప్పల శీనన్న ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగిందన్నారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆర్యవైశ్య విద్యార్థులు మెయిన్స్ పరీక్షకు పోటీపడుతున్నట్లయితే వారికి కూడా లక్ష రూపాయలను అందజేయడం జరుగుతుందన్నారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు కామారెడ్డి జిల్లా ఐ.వి.ఎఫ్ జిల్లా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.