విద్యార్థులు పోటీతత్వం అలవరుచుకోవాలి

కామారెడ్డి, డిసెంబరు 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం టెక్‌ బి, హెచ్‌ సి ఎల్‌ కంపెనీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు.

టేక్‌ బి – హెచ్‌ సి ఎల్‌ ఎర్లీ కేరీర్‌ ప్రోగ్రాం లో చేరి చదువుకుంటూనే ఉపాధి అవకాశాలను పొందే వీలుందని సూచించారు. జిల్లా నుంచి ఇప్పటికే 50 మంది విద్యార్థులు ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని తెలిపారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్‌ ఎంపీసీ గ్రూప్‌ కు చెంది 60 శాతం ఓవరాల్‌ మార్కులు పొందిన వారు అర్హులని పేర్కొన్నారు.

సాఫ్ట్వేర్‌ డెవలపర్‌, అనలిస్ట్‌, డిజైన్‌ ఇంజనీర్‌, డేటా ఇంజనీర్‌, సపోర్ట్‌, ప్రాసెస్‌ అసోసియేట్‌ ఉద్యోగాలు ఉంటాయని చెప్పారు. టేక్‌ బి ప్రోగ్రాం లో చేరిన విద్యార్థులు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత హెచ్‌ సి ఎల్‌ కంపెనీలో ఫుల్‌ టైం ఉద్యోగులుగా నియామకం ఉంటుందని చెప్పారు. ఈ ప్రోగ్రాం పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాన్ని బట్టి ఏడాదికి రూ.2.20 లక్షల వేతనంతో కెరీర్‌ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.

అభ్యర్థులు బిట్స్‌ పిలాని, శాస్త్ర యూనివర్సిటీ అందించే గ్రాడ్యుయేషన్‌ ఫోర్‌ గ్రామ్‌ చేసుకోవచ్చని సూచించారు. ఈ టెక్‌ బి ఒక సంవత్సరం శిక్షణకు అయ్యే రూ.1.18 లక్షల ఫీజును ఎడ్యుకేషనల్‌ లోన్‌ ద్వారా చెల్లించే వెసులుబాటు హెచ్‌ సి ఎల్‌ కల్పిస్తోందని పేర్కొన్నారు.

ఆదర్శ పాఠశాల, కేజీబీవీ, మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కిష్టయ్య మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు హెచ్‌సిఎల్‌ టెక్‌ బి ప్రోగాం ను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి షేక్‌ సలాం, అధికారులు శ్రీనివాస్‌, రాజేష్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »