Breaking News

Daily Archives: December 18, 2022

బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల సాయం

నందిపేట్‌, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత ఆదివారం గోవింద్‌పెట్‌ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెల్మల్‌ గ్రామానికి చెందిన ముగ్గురికి తీవ్రగాయలు కాగా అందులో మృతి చెందిన లక్ష్మీకి, గాయాలైన ఇద్దరికి మొత్తం కలిపి ఐదులక్షల రూపాయలను తెరాస యువజన విభాగం సీనియర్‌ నాయకుడు మల్యాల నర్సారెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్మూర్‌ మండలం గోవింద్‌పెట్‌ వద్ద గత ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో …

Read More »

ఆలూరులో ఘనంగా మల్లన్న జాతర

ఆలూరు, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూర్‌ మండలం శ్రీశ్రీశ్రీ కండే రాయుడు మల్లయ్య రెండవ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా మార్గశిర మాసంలో పౌర్ణమి తర్వాత రెండో ఆదివారం జాతర నిర్వహిస్తారు. ఆలూర్‌ గ్రామంలో రెండు ఆదివారాలు జాతర నిర్వహించడం విశేషం అని చెప్పుకోవచ్చు. కోరిన కోరికలు తీర్చే మల్లన్న స్వామి జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో …

Read More »

సంకరి నారాయణ రాజీనామా

కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాస్టర్‌ ప్లాన్‌ తొలగించాలని డిమాండ్‌ చేస్తూ అడ్లూర్‌ ఎల్లారెడ్డి టీఆర్‌ఎస్‌ రైతు స్వమన్వయ కమిటీకి సంకరి నారాయణ రాజీనామా చేశారు. ఉద్యమ కాలం నుండి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన సంకరి నారాయణ తనతో పాటు మిగతా రైతుల భూములను ప్రభుత్వం పరిశ్రమల పేరుతో గుంజుకునే ప్రయత్నం చేస్తుందని, తన రాజీనామాతోనైనా ప్రభుత్వానికి బుద్ధి వచ్చి తక్షణమే మాస్టర్‌ ప్లాన్‌ని …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం మహిళకు రక్తదానం

కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో కామారెడ్డి మండల కేంద్రానికి చెందిన భాగ్యలక్ష్మి (34) మహిళలకు కాలు ఆపరేషన్‌ నిమిత్తమై బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు ఐ.వి.ఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల, రెడ్‌ క్రాస్‌ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. దీంతో పాల్వంచ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »