ఆలూరు, డిసెంబరు 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలం శ్రీశ్రీశ్రీ కండే రాయుడు మల్లయ్య రెండవ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా మార్గశిర మాసంలో పౌర్ణమి తర్వాత రెండో ఆదివారం జాతర నిర్వహిస్తారు.
ఆలూర్ గ్రామంలో రెండు ఆదివారాలు జాతర నిర్వహించడం విశేషం అని చెప్పుకోవచ్చు. కోరిన కోరికలు తీర్చే మల్లన్న స్వామి జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారికి పూజలు మొక్కులు తీర్చుకుంటారు. మొక్కిన మొక్కులకు మల్లయ్య స్వామికి గొర్రె పిల్లలను సమర్పించుకుంటారు. ప్రతి సంవత్సరం మల్లయ్య జాతరను ఘనంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు భక్తులు నిర్వహిస్తారు.