కామారెడ్డి, డిసెంబరు 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాస్టర్ ప్లాన్ తొలగించాలని డిమాండ్ చేస్తూ అడ్లూర్ ఎల్లారెడ్డి టీఆర్‌ఎస్ రైతు స్వమన్వయ కమిటీకి సంకరి నారాయణ రాజీనామా చేశారు. ఉద్యమ కాలం నుండి టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సంకరి నారాయణ తనతో పాటు మిగతా రైతుల భూములను ప్రభుత్వం పరిశ్రమల పేరుతో గుంజుకునే ప్రయత్నం చేస్తుందని, తన రాజీనామాతోనైనా ప్రభుత్వానికి బుద్ధి వచ్చి తక్షణమే మాస్టర్ ప్లాన్‌ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సంకరి నారాయణ గత వారం రోజుల క్రితం ఎల్లారెడ్డి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. దీనిని దృష్టిలో పెట్టుకొని అడ్డూర్ ఎల్లారెడ్డి సర్పంచ్, ఇద్దరు ఎంపీటీసీలు సురేందర్‌ను విమర్శిస్తే అభివృద్ధి ఆగిపోతుందని ఎమ్మెల్యే సురేందర్‌కి క్షమాపణ చెప్పాలని తెలుపగా ఊరు అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పానని మరే ఉద్దేశంతో చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. రైతుల కోసం తాను వెన్నంటే ఉంటానని అందుకనే టిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని నారాయణ పేర్కొన్నారు.