నవీపేట్, డిసెంబరు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భార్య భర్తల మధ్య గొడవతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని భర్త ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్సై రాజరెడ్డి తెలిపారు. స్థానికుల సమాచారం ప్రకారం రెంజల్ మండలం కల్యాపూర్ గ్రామానికి చెందిన పరిద్కు నవీపేట్ మండలంలోని నాడపూర్ గ్రామానికి చెందిన సబ్రిన్తో మూడు సంవత్సరాల క్రితం వివాహం అయ్యిందన్నారు.
అప్పటి నుంచి తరచు ఇద్దరి మధ్య గొడవలు కావడంతో నాగేపూర్లో గతకొన్ని రోజులుగా నివాసం ఉంటున్న చోట ఆదివారం ఉదయం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకోవడంతో మంటలను ఆర్పి చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని తండ్రి సలం పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవ పంచనామా అనంతరం అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించినట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపాడు.