కామారెడ్డి, డిసెంబరు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లిక (28) అనే గర్భిణీ పేషంట్‌కి అత్యవసరంగా ఆపరేషన్ నిమిత్తమై అతితక్కువ మందిలో ఉండే ఓ నెగెటివ్ రక్తం అవసరం ఉండగా వారి కుటుంబ సభ్యులు కామారెడ్డి జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వహకులను సంప్రదించారు. దీంతో కామారెడ్డి మండలం కుప్రియల్ గ్రామానికి చెందన, మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కుమ్మరి గోపాల్ సహకారంతో వారికి కావాల్సిన ఓ నెగెటివ్ రక్తం అందజేశారు.
ఒక్క ఫోన్ కాల్ చేయగానే వచ్చి మానవతా ధృక్పతంతో స్పందించి రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతను జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ అభినందించారు. కార్యక్రమంలో వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్, కుటుంబ సభ్యులు ఉన్నారు.