నిజామాబాద్, డిసెంబరు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాత కలెక్టరేట్ కార్యాలయానికి సంబంధించినటువంటి స్థలాన్ని (కలెక్టర్ గ్రౌండ్) క్రీడా ప్రాంగణానికి కేటాయించాలని బిజెపి జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నర్సయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మి నారాయణ జిల్లా నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలిసి మెమోరండం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నర్సయ్య మాట్లాడుతూ ఎంఆర్‌వో కార్యాలయ స్థలాన్ని వెజిటేబుల్ మార్కెట్, ఫిష్ మార్కెట్ చేస్తామని, అలాగే డిఆర్‌వో కార్యాలయాన్ని పార్కింగ్ కోసం వాడటం జరుగుతుందని కలెక్టర్ చెప్పారన్నారు. పాత కలెక్టరేట్ సంబంధించినటువంటి స్థలంలో కళాభారతిని నిర్మిస్తామని కలెక్టర్ చెప్పారని పేర్కొన్నారు.
క్రీడాకారుల కొరకు పాత కలెక్టరేట్ స్థలాన్ని, కలెక్టర్ కలెక్టరేట్ గ్రౌండ్‌ని కలిపి పెద్ద క్రీడా మైదానం చేయాలని కలెక్టర్‌ని కోరగా ఇప్పుడున్నటువంటి పోలీస్ కమిషనరేట్ ను రాజారాం స్టేడియంకి తరలించిన తర్వాత క్రీడాకారుల కొరకు పోలీస్ కమిషనరేట్ సంబంధించినటువంటి స్థలంలో ఏడు ఎకరాలలో క్రీడా మైదానం చేపట్టడం జరుగుతుందని చెప్పారన్నారు. కలెక్టర్ చెప్పిన విధంగా క్రీడాకారులకు స్థలాన్ని కేటాయించని యెడల భారతీయ జనతా పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో పోతన్‌కర్ లక్ష్మినారాయణ, యెండల సుధాకర్ తదితరులున్నారు.