సిద్ధులగుట్టపై రూ.8 కోట్లతో బీటీ రోడ్డు

ఆర్మూర్‌, డిసెంబరు 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ప్రసిద్ధ సిద్ధులగుట్టపై రూ. 8 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి సోమవారం సాయంత్రం సిద్ధులగుట్టను సందర్శించి నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

బీటీ రోడ్డు నిర్మాణం పనులను పరివేక్షించిన ఆయన సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. పెద్ద ఎత్తున అతిథి గృహాలు నిర్మించడానికి ప్రతిపాదించిన స్థలాన్ని జీవన్‌ రెడ్డి పరిశీలించి కట్టడాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధులగుట్టను మహోన్నతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా, అధ్బుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి అవసరమైన నిర్మాణాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయన్నారు. ధ్యాన కేంద్రంతో పాటు రూ 2 కోట్ల వ్యయంతో క్షత్రియుల ఆరాధ్యదైవం జై సహసార్జున ఆలయం నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

కాగా జీవన్‌ రెడ్డి సిద్ధులగుట్టపై శివాలయం దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడి సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. పలువు ఎన్‌ఆర్‌ఐ భక్తులు జీవన్‌ రెడ్డితో ఫోటోలు దిగడానికి పోటీపడ్డారు. విదేశాల్లో స్థిరపడిన తాము ఈ ప్రాంతానికి చెందిన వారిమేనని, గతంలో అభివృద్ధి కి ఆమడ దూరంలో ఉన్న ఆర్మూర్‌ నియోజక వర్గం నేడు పూర్తిగా రూపు రేఖలు మారి అభివృద్ధి విరాజిల్లడం సంతోషంగా ఉందని విదేశాల నుంచి వచ్చిన భక్తులు అన్నారు.

గతంలో ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు లేరా అన్న అనుమానం కలుగుతోందని భక్తులు పేర్కొంటూ మీ పనితీరు అద్భుతం అంటూ వారు జీవన్‌ రెడ్డి కి కరచాలనం చేశారు. కాగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జీవన్‌ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులను అదేశించారు.

జీవనన్న ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రతీ సోమవారం భక్తులకు ఉచిత భోజన సౌకర్యం కలిపిస్తున్నామని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చే నెలలో సిద్ధులగుట్ట పర్యటనకు వస్తున్నారని ఆయన వెల్లడిరచారు. కేసీఆర్‌ చేతుల మీదుగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యాక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉంటాయని జీవన్‌ రెడ్డి తెలిపారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »