మానవత్వాన్ని చాటిన రక్తదాత…

కామారెడ్డి, డిసెంబరు 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన శ్రీనివాస్‌ క్యాన్సర్‌ వ్యాధితో హైదరాబాద్‌ లోని గాంధీ వైద్యశాలలో బాధపడుతుండడంతో వారికి కావలసిన రక్తం అందుబాటులో లేకపోవడంతో వారి బంధువులు రెడ్‌ క్రాస్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి మెదక్‌ జిల్లా శెట్టిపల్లి కలాన్‌ గ్రామానికి చెందిన రాజేంద్రనగర్‌లో అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్న జంగిటి చంద్రం మానవతా దృక్పథంతో స్పందించి గాంధీ వైద్యశాలకు వెళ్లి రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్‌ వేదప్రకాష్‌ మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి కోసం రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత జంగిటి చంద్రంకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా అధ్యక్షుడు జితేష్‌ వి పాటిల్‌ తరఫున అభినందనలు తెలిపారు.

ప్రస్తుత సమాజంలో తోటి వారికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అంటే మనకెందుకు అని ఆలోచించకుండా మానవతా దృక్పథంతో సహాయం చేయడానికి ముందుకు రావాలన్నారు. రక్తదానం చేయాలనుకునేవారు 9492874006 నెంబర్‌ కి సంప్రదించాలన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »