కామారెడ్డి, డిసెంబరు 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీజేపీ కామారెడ్డి, జిల్లా కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షురాలు అరుణా తార అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రెమెందర్ రెడ్డి మాట్లాడుతూ బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేయాలనీ, పార్టీకి ఆయువు పట్టు బూత్ స్థాయి కార్యకర్తలే అని, వారు ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ కోసం పని చేయాలని సూచించారు.
తెలంగాణలో ప్రజలు అధికార బిఆర్ఎస్తో విసిగి పోయారని అందరూ బీజేపీ వైపు చూస్తున్నారని, భవిషత్తు బీజేపిదేనని అన్నారు. కావున జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పని చేసి జిల్లాలోని 4 నియోజకవర్గాలను కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కేంద్ర పార్టీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, రాబోయే రోజుల్లో జిల్లాలో కేంద్ర, రాష్ట్ర నాయకులు పర్యటించే అవకాశం ఉంది కావున అందరూ పార్టీ పటిష్టతకు సమయం ఇవ్వాలని పిలుపునిచ్చారు.