కామారెడ్డి, డిసెంబరు 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేయు స్థలాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. రూ.23.75 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు.
బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారని చెప్పారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంత్రి హరీష్ రావు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ,ఆరోగ్య అధికారి లక్ష్మణ్ సింగ్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.