బీర్కూర్, డిసెంబరు 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూరు మండల కేంద్రానికి చెందిన ధూళిగ లింగమయ్య ఇటీవల ప్రమాదవశాత్తు పాముకాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఉపాధి హామీ తరపున రెండు లక్షల చెక్కును, వైద్య ఖర్చులు క్రింద 73 వేల 223 రూపాయలను మంగళవారం ఎంపీపీ తిలకేశ్వరి రఘు, మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ చేతుల మీదుగా లబ్ధిదారునికి అందజేశారు.
కార్యక్రమంలో రైతుబంధు అధ్యక్షుడు అవారీ గంగారం, జడ్పిటిసి తన బుద్ధి స్వరూప శ్రీనివాస్, తహాసిల్దార్ రాజు, ఎంపీడీవో భాను ప్రకాష్, ఎంపిటిసి సందీప్, కిష్టాపూర్ సర్పంచ్ పుల్లెం బాబు, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.