ఎడపల్లి, డిసెంబరు 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దూరాలను దగ్గర చేస్తూ ప్రజల అవసరాలకు ఆసరాగా 90 సంవత్సరాల నుంచి ప్రజల మనసులు గెలుచుకొన్న టీఎస్ ఆర్టీసీని ఆధరిస్తున్న ప్రతీ ఒక్కరికి దన్యవాదాలు తెలుపుతూ గ్రామ గ్రామాన కరీంనగర్‌కు చెందిన ప్రజా రవాణా చైతన్య కళా బృందంచే అవగాహన సదస్సులు నిర్వహించారు.
ఈ మేరకు మంగళవారం ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో బోధన్ డిపో ఎస్టీఐ జానబాయి, ఎస్‌ఎం దయానంద్ ఆద్వర్యంలో ప్రజా రవాణా చైతన్య రథం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళా బృందం సభ్యులు గత 90 ఏండ్లుగా ఆర్టీసీ ద్వారా ప్రజలకు రవాణా అందజెస్తున్న సేవలపై అవగాహన కల్పించారు.
ప్రయాణీకులకు ఆర్టీసీ సంస్థ అంద జెస్తున్న రాయితీలను తెలియజేశారు. సీజన్ టికెట్ కొనూగోళుతో 20 రోజుల చార్జీ చెల్లింపు తో 30 రోజులు ప్రయణింఛ వచ్చన్నారు. ట్రావెల్ యా జ్ యూ లైక్ టికెట్ ద్వారా హైదరాబాద్ లో 24 గంటల పాటు, 60 రూపాయలతో వరంగల్ లో 24 గంటల పాటు ప్రయాణం చేయవచ్చన్నారు. ఆర్టీసీ తార్నాక ఆసుపత్రిలో సరసమైన ధరలతో నిపుణుల సంప్రదింపులు, అన్నీ రకాల అత్యవసర చికిత్సలు చేయబడునని తెలిపారు.
ఔషదాల కొనుగోలు పై 15 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుందని తెలిపారు. పెళ్ళిళ్ళకు, శుభ కార్యాలకు బస్‌ను బుక్ చేసుకొంటే ఆకర్షణీయమైన డిస్కౌంట్ లభిస్తుందని పేర్కొన్నారు. రోగులందరికీ 2 గంటల పాటు ఉచిత ప్రయాణం వంటి రాయితీలు, అఫర్‌లను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో కార్గో ఇన్చార్జ్ షాహిద్, సేఫ్టీ వార్డెన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.