క్రిస్మస్‌ కానుకలు పంపిణీ చేసిన సభాపతి

బాన్సువాడ, డిసెంబరు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ ఆదరిస్తున్న ప్రభుత్వం దేశంలో ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బుధవారం శివారులోని పిఆర్‌ గార్డెన్లో ఏర్పాటుచేసిన నియోజకవర్గస్థాయి క్రైస్తవులకు క్రిస్మస్‌ కానుకలను సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను ఆదరిస్తూ మహిళలకు బతుకమ్మ చీరలు, మైనార్టీ సోదరులకు రంజాన్‌ తోఫా, క్రిస్మస్‌ సోదరులకు కానుకలను ప్రభుత్వ పక్షాన అధికారికంగా అందజేయడం జరుగుతుందని, ముందస్తుగా క్రిస్మస్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి కుల మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే రాజకీయ నాయకులు వద్దని ప్రజలకు సేవ చేసే లీడర్లు కావాలని ఆయన అన్నారు.

గత ప్రభుత్వాలు కనీసం అన్ని మతాలను గౌరవించుకునే విధంగా ఆలోచన కూడా చేయలేదని భిన్నత్వంలో ఏకత్వంలో ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని మతాలను గౌరవిస్తూ పాలన సాగిస్తున్నారన్నారు. ఎవరి మతాలను వారు గౌరవించుకునే సాంప్రదాయం మనదేశంలో ఉందని ఏ మతాన్ని కించపరచకుండా అన్ని మతాలను గౌరవించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. క్రిస్మస్‌ పండుగ తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.

క్రిస్మస్‌ పండుగ ప్రభుత్వ పండుగ జరుపుకుంటున్నమన్నారు. హిందువులు దసరా, ముస్లింలు రంజాన్‌, క్రైస్తవులు క్రిస్మస్‌ పండుగ రోజున ప్రతి పేదవాడు కొత్త దుస్తులు ధరించి పండుగను ఘనంగా జరుపుకుంటారని, క్రిస్మస్‌, రంజాన్‌ కిట్లను అందించడం ద్వారా ప్రతి పేదవారు కూడా పండగను ఘనంగా జరుపుకుంటారన్నారు. ఇచ్చే కానుక ఎంత విలువైనది కాకుండా ప్రేమతో ఇచ్చే కానుకగా ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ పండుగను ఘనంగా జరుపుకుంటారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్‌ పండుగ అని పోచారం అన్నారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ క్రిస్మస్‌ సోదరులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్‌ రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, బీర్కూర్‌ ఎంపీపీ తిలకేశ్వరి రఘు, తహాసిల్దార్‌ గంగాధర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నర్సింలు, వైస్‌ చైర్మన్‌ బుల్లెట్‌ రాజు, సీనియర్‌ నాయకులు ఏజాస్‌, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, చర్చి పాస్టర్‌ దైవసాయం, నియోజకవర్గ క్రిస్మస్‌ సోదరులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »