బాన్సువాడ, డిసెంబరు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని జూనియర్ కాలేజ్ దుకాణ సముదాయంలో వీరభద్ర కన్ఫెక్షనరీ దుకాణం నిర్వహిస్తున్న కోటి ప్రవీణ్ వ్యాపారస్తుడు బుధవారం ఉదయం దుకాణం తెరచి కూరగాయలు తీసుకురావడానికి బయటకు వెళ్లాడు. దుకాణం షటరు మూసి వెళ్లడంతో అతనిని గమనించిన ముగ్గురు వ్యక్తులు తర్వాత షట్టర్ తెరిచి డబ్బున్న బ్యాగును ఎత్తుకొని వెళ్లారు.
గమనించిన పక్కన ఉన్న పండ్ల వ్యాపారి చోరీ చేసిన వారిని వెంబడిరచారు. షాపు యజమాని డబ్బులు పోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇట్టి విషయమై సిఐ మహేందర్ రెడ్డిని వివరణ కోరగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.