పనులు త్వరితగతిన చేయాలి

కామారెడ్డి, డిసెంబరు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం దేవునిపల్లి శివారులో బుధవారం 50 పడకల క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌ భవన నిర్మాణానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు భూమి పూజ చేశారు. మాతా శిశు ఆసుపత్రి భవన నిర్మాణం పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన చేయాలని సూచించారు.

కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, జెడ్పి చైర్‌ పర్సన్‌ శోభ, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎల్లారెడ్డి, జుక్కల్‌ ఎమ్మెల్యేలు సురేందర్‌, హనుమంత్‌ షిండే, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేతా మహంతి, జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్‌ సింగ్‌, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »