కామారెడ్డి, డిసెంబరు 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 25 డిసెంబర్ న భారత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరగబోయే యూత్ పార్లమెంటు సమావేశంలో మాట్లాడటానికి ఆర్కే కళాశాల విద్యార్థిని కె. మౌనిక ఎంపిక కావడం పట్ల కలెక్టర్ ప్రశంసించారు. వివిధ దశల్లో కళాశాల, యూనివర్సిటీ, రాష్ట్ర మరియు దేశస్థాయిలో జరిగిన ఉపన్యాస పోటీలో ఉత్తీర్ణత సాధిస్తూ దేశవ్యాప్తంగా రాష్ట్రం నుంచి ఒకరు చొప్పున 25 మంది ఎంపికవగా, తెలంగాణ నుంచి ఆర్కే కళాశాల నుండి కె. మౌనిక ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన కాంపిటీషన్లో దేశవ్యాప్తంగా ఏడుగురిని మాత్రమే ఎంపిక చేయగా, మూడవ స్థానంలో నిలిచిన మౌనిక తెలంగాణ ఖ్యాతిని నిలబెట్టిందని కలెక్టర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా కే.మౌనికను వారి తల్లిదండ్రులను, ప్రోత్సహిస్తున్నటువంటి ఆర్కే కళాశాల సీఈవో జైపాల్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులను అభినందించారు.
అదేవిధంగా ఈనెల 25న విజయం సాధించి రాష్ట్ర ఖ్యాతిని పెంచాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆర్కే కళాశాలల సీఈవో జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆర్కే కళాశాల కేవలం విద్యార్థులను చదువులోనే కాకుండా ఆటలు, ఇతర సాంస్కృతిక, వివిధ కాంపిటీషన్స్, పోటీ పరీక్షల్లో కూడా వెన్ను తట్టి ప్రోత్సహించి రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు రాణించేలా కృషి చేస్తుందని తెలిపారు.
అదేవిధంగా అడిషనల్ కలెక్టర్లు, అడిషనల్ ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఆర్ కే – సిఇఓ డాక్టర్ జైపాల్ రెడ్డి, కోఆర్డినేటర్ దత్తాత్రి, డీన్ నవీన్ కుమార్, ప్రిన్సిపల్స్ సైదయ్య, గోవర్ధన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్స్ గంగాధర్, ప్రభాకర్, బాలు, రవి, శ్రీధర్, అధ్యాపకులు ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఇతరులు పాల్గొన్నారు.