ఆపరేషన్‌ నిమిత్తం గర్భిణీకి రక్తదానం…

కామారెడ్డి, డిసెంబరు 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన గౌసియా బేగం (26) గర్భిణికి ఆపరేషన్‌ నిమిత్తమై ప్రైవేటు వైద్యశాలలో బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభ్యం కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్‌క్రాస్‌, ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు.

దీంతో వెంటనే స్పందించి నక్షత్ర వైద్యశాల డైరెక్టర్‌ కాశెట్టి ఆంజనేయులు తాడ్వాయి సహకారంతో బి పాజిటివ్‌ రక్తాన్ని గురువారం వి. టి.ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో అందజేశారు.

రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత కాశెట్టి ఆంజనేయులుకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, రెడ్‌ క్రాస్‌ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ కామారెడ్డి డివిజన్‌ సెక్రెటరీ జమీల్‌, టెక్నీషియన్‌ ఏసుగౌడ్‌లు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »