బాన్సువాడ, డిసెంబరు 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు రావాల్సిన పెండిరగ్ స్కాలర్‌షిప్, ఫీజు రియంబర్స్‌మెంట్‌లను విడుదల చేయాలని కోరుతూ బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏబీవీపీ జోనల్ ఇన్చార్జి శ్రీకాంత్ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడి రాస్తారోకో చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థుల పట్ల నిష్పక్షతపాతంగా వ్యవహరిస్తూ విద్యార్థుల సమస్యలను తీర్చడంలో విఫలమయ్యారని ఆయన అన్నారు. విద్యార్థులకు రావలసిన పెండిరగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించి కాలేజీలలో మౌలిక సదుపాయాలు కల్పించి, కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి విద్యార్థుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు.
విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూశారు.