కామరెడ్డి, డిసెంబరు 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని ఆసుపత్రులు కాలుష్య నియంత్రణ బోర్డు నుంచి అనుమతులను తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 పై పర్యవేక్షణ కై జిల్లా స్థాయి కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు.
సమావేశానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల నుంచి వెలువడి బయో వ్యర్థాల నిర్వహణ, శాస్త్రీయ బద్ధమైన నిర్వీర్యం పై చర్చించారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల నుంచి వెలువడే బయో వ్యర్ధాలు శ్రీ మెడికేర్ సర్వీసెస్ అథరైజుడ్ ఏజెన్సీకి ఇవ్వాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ అన్యోన్య, పర్యావరణ ఇంజనీర్ లక్ష్మణ్ ప్రసాద్, జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, వైద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.