కామారెడ్డి, డిసెంబరు 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామీణ క్రీడా ప్రాంగణాలను డిసెంబర్ 31 లోగా ఏర్పాటు చేయాలని పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అన్ని గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.
కంపోస్ట్ షెడ్లు వినియోగంలో ఉండే విధంగా చూడాలన్నారు. నర్సరీల నిర్వహణ సజావుగా చేపట్టాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయతీరాజ్ డైరెక్టర్ ఎం హనుమంతరావు, జిల్లా నుంచి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలో తడి, పొడి చెత్త సేకరణ నిత్యం కొనసాగుతుందని తెలిపారు.
కంపోస్ట్ షెడ్డులో తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువు తయారుచేసి రైతులకు విక్రయిస్తున్నారని తెలిపారు. పొడి చెత్తను విక్రయించి గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చుతున్నారని పేర్కొన్నారు. వైకుంఠధామాలలో తాగునీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిఆర్‌డిఓ సాయన్న, డిపిఓ శ్రీనివాసరావు, జెడ్పి సీఈవో సాయగౌడ్, డిఎల్‌పిఓ సాయిబాబా పాల్గొన్నారు.