కామారెడ్డి, డిసెంబరు 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామస్తుల పిర్యాదు మేరకు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. గ్రామంలో లైసెన్స్ లేకుండా, కల్తీ కల్లుపై వచ్చిన పిర్యాదు మేరకు రాజంపేట గ్రామంలో కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించగా అనుమతి లేకుండా ఎల్లమ్మ గుడి సమీపంలో కల్లు అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని 62.4 లీటర్ల కల్లును సంఘటన స్థలంలోనే ధ్వంసం చేశారు.
కేసు నమోదు చేశారు. దుకాణంలో తనిఖీ నిర్వహించి శాంపిల్స్ సేకరించి నిజామాబాద్ కెమికల్ ల్యాబుకు పంపించారు. గతంలో ఇట్టి కల్లు దుకాణంనుండి కల్లు శాంపుల్ సేకరించి ల్యాబ్‌కు పంపటం వల్ల కల్తీ కల్లు అని తేలడం మూలంగా వారి లైసెన్సులు రద్దు చేశామన్నారు. దోమకొండ ఎక్సైజ్ సిఐ ఆర్ పోతారెడ్డి, కానిస్టేబుల్ శ్రీనివాస్, మహేష్ బాబు, బాలరాజు దాడుల్లో పాల్గొన్నారు.