లింగంపేట్, డిసెంబరు 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపెట్ మండల కొండాపూర్ గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ (20) ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామ సర్పంచ్ సత్యం స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ని సంప్రదించగా వెంటనే స్పందించి హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో సంబంధిత డాక్టర్లతో మాట్లాడి చికిత్స చేయించారు.
రోగికి వెన్నుపూస సంబంధిత శస్త్రచికిత్స ఖర్చుల నిమిత్తం ఎల్వోసి రూ. 3 లక్షల చెక్కును మంజూరు చేయించారు. పర్మల్ల తాండాకు చెందిన మాలోత్ లక్ష్మీ చికిత్స నిమిత్తం ఎల్వోసి రూ.3 లక్షల చెక్కును మంజూరు చేయించారు.
కాగా శుక్రవారం ఎమ్మెల్యే ఆదేశానుసారం గ్రామ సర్పంచ్ సత్యనారాయణ, భారాస నాయకుడు శ్రీనివాస్ నాయక్, భుంగారి రాములు ఆసుపత్రికి వెళ్లి రోగుల కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేశారు. ఆపదసమయంలో ఆదుకున్న ఎమ్మెల్యేకి రోగి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.