కామారెడ్డి, డిసెంబరు 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజంపేట మండలం శివాయిపల్లి గ్రామంలో శుక్రవారం రాజంపేట మండలం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బాధితులకు తార్ఫాలిన్, హైజీనిక్ కిట్లను, వంట సామాగ్రిని, దుప్పట్లను రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, డివిజన్ చైర్మన్ జమీల్, మండల వైస్ చైర్మన్ ప్రసాద్, సర్పంచ్ విఠల్ రెడ్డి, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్ కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో రెడ్‌క్రాస్ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేయడంలో, రక్తదాన శిబిరాలను నిర్వహించడంలో కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా ఉందని అన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఎల్లవేళలా రక్తాన్ని అందజేయడానికి సిద్ధంగా ఉంటామన్నారు. ఆపదలో ఉన్నవారికి 9492874006 నెంబర్ సంప్రదించినట్లయితే రక్తాన్ని అందజేస్తామన్నారు. కార్యక్రమంలో వార్డు మెంబర్లు పాల్గొన్నారు.