కామరెడ్డి, డిసెంబరు 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏసుక్రీస్తు చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని లక్ష్మీదేవి గార్డెన్లో శుక్రవారం క్రిస్టమస్ సెలబ్రేషన్స్‌కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఏసుక్రీస్తు శాంతి, ప్రేమ ను పంచాడని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు సోదర భావంతో మెలగాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రం క్రిస్టమస్‌ను అధికారికంగా నిర్వహించడం లేదని చెప్పారు. మన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అన్ని వర్గాల పండగలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. కామారెడ్డి నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు.
కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం, నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కేకును కట్ చేశారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. అన్ని మతాలను ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు.
అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తుందని చెప్పారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు దుస్తులను పంపిణీ చేశారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఆర్డీవో శ్రీనివాసరెడ్డి, ఎంపీపీలు ఆంజనేయులు, బాలమణి, కౌన్సిలర్లు గోదావరి, కృష్ణాజి రావు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.