కామారెడ్డి, డిసెంబరు 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిపిఆర్ పై రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని చింతల బాలరాజు గౌడ్ ఆడిటోరియంలో జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సిపిఆర్ ఫై విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
గుండె నొప్పితో బాధపడుతున్న వారికి ప్రథమ చికిత్స చేయాలని సాధ్యమైనంత వరకు ప్రాణాలు కాపాడాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా సిపిఆర్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్నకు సూచించారు. గుండెపోటు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శిక్షకుడు రమణ వివరించారు.
వచ్చిన వారికి ప్రాథమిక చికిత్స చేయవలసిన విధానాన్ని ప్రయోగాత్మకంగా తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ ఎం.రాజన్న, వైస్ చైర్మన్ నాగరాజు, ఆర్టీవో వాణి, జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కిష్టయ్య, రెడ్ క్రాస్ జిల్లా కరస్పాండెంట్ నరసింహ, జిల్లా కోశాధికారి దస్తీరం పాల్గొన్నారు.