నెల రోజుల్లోగా ఆర్మూర్‌ అర్బన్‌ పార్క్‌

ఆర్మూర్‌, డిసెంబరు 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంతో ప్రతిష్టాత్మకంగా తల పెట్టిన ఆర్మూర్‌ అర్బన్‌ పార్క్‌ నిర్మాణం పనులను నెల రోజుల్లోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పీయూసీ ఛైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి వెల్లడిరచారు. ‘‘నమస్తే నవనాధపురం’’ కార్యక్రమంలో భాగంగా శనివారం మాక్లూర్‌ మండలంలోని చిన్నాపూర్‌ గ్రామం వద్ద ఆర్మూర్‌ అర్బన్‌ పార్క్‌ నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు.

ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి అర్బన్‌ పార్క్‌కు చేరుకున్న జీవన్‌ రెడ్డి పార్క్‌ మొత్తం కలియ తిరుగుతూ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమావేశమై పార్క్‌ నిర్మాణంలో భాగంగా చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు. ఈ పార్క్‌ నిర్మాణంలో పాలుపంచుకునే అధికారులు, ప్రజా ప్రతినిధులు చరిత్రలో నిలిచిపోతారన్నారు. చేపట్టిన పనులలో విజయం సాధించడం కోసం అంకితభావంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని జీవన్‌ రెడ్డి అధికారులకు ఉద్బోధించారు.

అనంతరం జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ అటవీశాఖ పర్యవేక్షణలో ఆర్మూర్‌ అర్బన్‌ పార్క్‌ నిర్మాణం జరుగుతున్న దన్నారు.166 హెక్టార్లు అనగా మొత్తం 470 ఎకరాల్లో చేపట్టిన ఈ పార్క్‌ నిర్మాణాన్ని నెల రోజుల్లోగా పూర్తి చేసి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఆర్మూర్‌ అర్బన్‌ పార్క్‌ లో ఆరు కిలో మీటర్ల పొడవునా వాకింగ్‌ ట్రాక్‌ ను నిర్మిస్తున్నామని జీవన్‌ రెడ్డి పేర్కొంటూ తెలంగాణ రాష్ట్రంలోని ఆరు కిలో మీటర్ల వాకింగ్‌ ట్రాక్‌ ఉన్న ఏకైక పార్క్‌ ఇదేనన్నారు.

పార్కులో రెండు ఓపెన్‌ జిమ్‌లు, మెయిన్‌ గేట్‌, ఆరు కిలో మీటర్ల పార్క్‌ చుట్టూ కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం, చిన్నపూర్‌ చెరువు సుందరీకరణ, పార్క్‌కు మంచినీటి సౌకర్యం, విద్యుత్‌ సరఫరా, కల్వర్టుల నిర్మాణం వంటి పనులకు ఇప్పటికే ఆరు కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు జీవన్‌ రెడ్డి వివరించారు. ఈ నిధులను మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు రుణపడి ఉంటామన్నారు.

మరో అయిదు కోట్ల రూపాయల ఖర్చుతో పార్కు సమీపంలో ఉన్న చిన్నపూర్‌ చెరువుతో పాటు గాజులకుంట, ఇనాయి కుంటలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, బోటింగ్‌ ఏర్పాటు, మినీ ట్యాంక్‌ బండ్‌ల నిర్మాణం వంటి పలు పనులు చేపడతామన్నారు. పార్క్‌లో చేసిన ప్లాంటేషన్‌కు, స్టోన్స్‌ పై నేచురల్‌ నేమ్స్‌ లిఖించడానికి, త్రీడీ బొమ్మలు చిత్రీకరించడానికి నిధులు మంజూరు చేస్తామన్నారు.

ఇంకా ఈ పార్కు లో గజేబో,ఓపెన్‌ క్లాస్‌ రూమ్‌ లు, పురుషులు, మహిళలకు వేర్వేరుగా వాష్‌ రూముల నిర్మాణం, వాకింగ్‌ ట్రాక్‌ పొడవునా 46 బెంచిలతో సిట్టింగ్‌ ఆరెంజ్‌ మెంట్‌ తో పార్క్‌ వాతావరణం ఆహ్లాదకరంగా మారిందని జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. 300ఎకరాల అటవీ విస్తీర్ణం స్పష్టంగా కనిపించేలా ఎతైన గుట్టపై 30ఫీట్ల ఎత్తులో వాచ్‌ టవర్‌ ను నెలకొల్పామని జీవన్‌ రెడ్డి వెల్లడిరచారు.

ఈ వాచ్‌ టవర్‌లో మూడు ఫ్లోర్లు ఉన్నాయన్నారు.ఈ వాచ్‌ టవర్‌ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద దవుతుందన్నారు. కాగా అద్భుతమైన ఈ ఆర్మూర్‌ అర్బన్‌ పార్క్‌ను మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్‌ ఆర్మూర్‌ నియోజకవర్గ ప్రజల పాలిట దేవుడని, ఆయన దయతోనే ఆర్మూర్‌ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమైందని జీవన్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆర్మూర్‌ అర్బన్‌ పార్క్‌ తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా ఆయన అభివర్ణించారు.

ఈ పార్క్‌ నిర్మాణంలో భాగస్వాములు అయిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను, ప్రజా ప్రతినిధులను ఆయన అభినందించారు. ముఖ్యంగా అటవీశాఖ అధికారులు రెండు సంవత్సరాలు శ్రమించి ఈ పార్క్‌ కు ఒక రూపమిచ్చా రన్నారు. ఈ పార్కును ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు జీవన్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు శ్రీనివాస్‌, సౌమ్య, అశోక్‌ కుమార్‌, మాక్లూర్‌ మండల పరిషత్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌, సర్పంచ్‌ గంగారెడ్డి, అడివి మామిడిపల్లి సర్పంచ్‌ మల్లారెడ్డి, ఎంపీటీసీ సత్యనారాయణ, నిజామాబాద్‌ నగర కార్పొరేటర్‌ రాయిసింగ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, బిఆర్‌ఎస్‌ పార్టీ మాక్లూర్‌ మండల అధ్యక్షులు బుడుగు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »