వేల్పూర్, డిసెంబరు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం పడగల్ గ్రామం నుండి పడగల్ ఎక్స్ రోడ్ వరకు అక్కడక్కడ రోడ్డుపై గుంతలు పడడంతో ఈ నెల 18వ తేదీన నడిమోర్రె మూలమలుపు వద్ద రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. ఆ సంఘటన అనంతరం ప్రధాన సమస్య రోడ్డుపై గుంతలే కారణమని తెలుసుకున్న ఆటో యూనియన్ వారు దాతల సహకారంతో శనివారం రోడ్డుపై గుంతలను సిమెంట్ కంకరతో పూడ్చివేశారు.
కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు గంగాధర్, పులి రాజన్న, షకీల్, నారాయణ, రాజేశ్వర్, గంగారామ్, పోషన్న, పాల్గొన్నారు. ఆటో యూనియన్ సభ్యులను గ్రామస్తులు అభినందించారు.