కామారెడ్డి, డిసెంబరు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన భారతి (40) కి పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో ప్రభాకర్ మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడినట్టు రెడ్‌క్రాస్ జిల్లా, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలు, అడ్లూరు ఎల్లారెడ్డి వార్డు సభ్యులు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ 2007లో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందించాలని మంచి సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కామారెడ్డి రక్తదాతల సమూహము చేస్తున్న రక్తదాన సేవ కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సమూహలు ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు.
రక్తదాతకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ ఏసుగౌడ్ పాల్గొన్నారు.