రెంజల్, డిసెంబరు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని బోధన్ నిజం షుగర్ ఫ్యాక్టరీని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తెరిపిస్తామని హామీ ఇచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎనిమిదేళ్లు గడుస్తున్నా షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేదని బిజెపి బోధన్ నియోజకవర్గ ఇన్చార్జ్ మేడ ప్రకాష్ ప్రకాష్ రెడ్డి అన్నారు.
శనివారం రెంజల్ మండలంలోని మౌలాలి తండా, తాడ్ బిలోలి, బొర్గం, సాటాపూర్ గ్రామాల్లో బీజేపీ నాయకులు మోహన్ రెడ్డితో కలిసి మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్ళలా జనంతో మనం గడపగడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి టిఆర్‌ఎస్ ప్రభుత్వం పథకాలను ఎండగడుతూ మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్, నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాలు, రైతు రుణమాఫీ వంటి పథకాలను బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలతో చెలగాటమాడుతున్నారని ప్రజా సమస్యలు నెరవేరాలంటే రానున్న ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తే ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని వారు అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చుక్క రాజు, మాజీ మండల అధ్యక్షులు మేక సంతోష్, లోలపు కిషోర్, వైస్ ఎంపీపీ యోగేష్, నాయకులు గోపికృష్ణ, ప్రసాద్, శివ, నగేష్, ప్రతాప్ రెడ్డి, గోపాల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.