కామారెడ్డి, డిసెంబరు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినియోగదారుల కమిషన్లలోని కేసులను సమర్ధవంతంగా పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్స్ హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
వినియోగదారులు హక్కుల గురించి తెలుసుకోవాలని సూచించారు. మార్కెట్లో వినియోగదారుడు తనకి ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వినియోగదారుడు మోసపోతే కేసు వేస్తే న్యాయం జరుగుతుందని చెప్పారు. ఐఎస్‌ఐ మార్క్ నాణ్యతకు చిహ్నంగా ఉంటుందన్నారు. విద్యార్థులకు చదువుకునే వయసు నుంచి వస్తువుల నాణ్యతపై అవగాహన కల్పించాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిని పద్మ మాట్లాడారు. బిఐఎస్ జాయింట్ డైరెక్టర్ రాకేష్ తన్నీరు వస్తువుల నాణ్యతను ఐఎస్ ఐ మార్కు ద్వారా గుర్తించవచ్చని పవర్ ప్రజెంటేషన్ ద్వారా వినియోగదారులకు వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ గోరేనందు ప్రసాద్ యాదవ్, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.