నసురుల్లాబాద్, డిసెంబరు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో శనివారం కేంద్ర ప్రభుత్వం సంవత్సరం పాటు పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ పొడిగించినందుకుగాను భాజపా నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు హాన్మాండ్లు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన కార్యక్రమంగా ప్రచారం చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని, దీనిని ప్రజలు గమనించాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు హన్మాండ్లు యాదవ్, శంకర్, గంగాధర్ గుప్తా, దేవి సింగ్, కూనింటి రాము, గంగాధర్, నాని, సాయిలు తదితరులు పాల్గొన్నారు.