ఆర్మూర్, డిసెంబరు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సౌదీలో మృతి చెందిన ఒక వ్యక్తి పార్థివ శరీరాన్ని స్వస్థలానికి తరలించేందుకు ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఆర్మూర్ ప్రాంతానికి చెందిన నునావత్ మాన్యా అనే వ్యక్తి సౌదీలో మృతి చెందాడు. కాగా అతడి కుటుంబ సభ్యులు శనివారం ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసి మాన్యా మృతదేహాన్ని ఇక్కడకు తరలించేందుకు సాయపడాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
దీనిపై వెంటనే స్పందించిన ఆయన ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళుతానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడి మాన్యా మృతదేహాన్ని హైదరాబాద్ తరలించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. హైదరాబాద్ నుంచి మృతదేహాన్నీ స్వస్థలానికి చేర్చడానికి తాను స్వయంగా అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని కూడా జీవన్ రెడ్డి మాటిచ్చారు.