కామారెడ్డి, డిసెంబరు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తపస్ కామారెడ్డి జిల్లాశాఖ ఆద్వర్యంలో నూతన కాలమానిని శాసన సభ్యులు గంప గోవర్దన్ చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ తపస్ జిల్లాశాఖ క్యాలెండర్ ఉపాద్యాయులను, విధ్యార్థులను ఆలోచింపచేసే విదంగా ఉందని అభినందించారు.
భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించాలని సూచించారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాల్యంలోనే బీజం పడుతుందని స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. పిల్లలను మంచి మార్గంలో ప్రయాణించే దిశగా వారికి చదువు అందించాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సంఖ్యను పెంచాలన్నారు. కార్యక్రమంలో తపస్ జిల్లా అద్యక్షులు పుల్గం రాఘవరెడ్డి, రాష్ట్ర భాద్యులు మ్యాక రాంచెంద్రం, భాస్కరాచారి, జిల్లా భాద్యులు ఆంజనేయులు, లక్ష్మీపతి, తగ్లేపల్లి భాస్కర్, శ్రీనివాస శర్మ, బాల్‌కిషన్, శశిధర్, తదితరులు పాల్గొన్నారు.